calender_icon.png 15 January, 2025 | 3:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్‌తరుణ్ కేసులో ట్విస్ట్

07-07-2024 12:05:42 AM

ఫిర్యాదు చేసిన లావణ్యకు నార్సింగి పోలీసుల నోటీసులు 

తగిన ఆధారాలు సమర్పించాలని సూచన 

తనపై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం లేదన్న హీరోయిన్ మాల్వి మల్హోత్రా

రాజేంద్రనగర్, జూలై 6: సినీ నటుడు రాజ్‌తరుణ్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. అతడిపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన అతడి మాజీ లవర్ లావణ్యకు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలకు తగిన ఆధా రాలు సమర్పించాలని ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి శనివారం నోటీసులు ఇచ్చారు. అయితే, ఆమెకు పోలీసులు కాల్ చేసినా లిఫ్ట్ చేయ డం లేదని, ఎంతకూ అందుబాటులోకి రాలేదని సమాచారం.

కాగా రాజ్‌తరుణ్ తనతో 11 ఏళ్లు సహ జీవనం చేసి శారీరకంగా వాడుకున్నాడని లావణ్య అనే యువతి శుక్రవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఉమెన్ పోలీస్ ఆఫీసర్‌కు నాలుగు పేజీల ఫిర్యాదు కాపీ ఇచ్చి వెళ్లిపోయారు. అదేవిధంగా రాజ్‌తరుణ్‌తో పాటు పలువురిపై సంచలన ఆరో పణలు చేసింది. ఆమె నుంచి స్పందన రాకపోతే తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి పేర్కొన్నారు. లావ ణ్య ఆరోపణలపై ఇప్పటికే రాజ్‌తరుణ్ స్పం దించారు. ఆమెతో తనకు గతంలో రిలేషన్ ఉందని, ఆమె డ్రగ్స్‌కు బానిస కావడంతో దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు. రాజ్‌తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో రిలేషన్‌లో ఉన్నారని కూడా లావణ్య ఆరోపించిన విషయం తెలిసిందే. 

నేనూ ఫిర్యాదు చేస్తా: హీరోయిన్ మాల్వి మల్హోత్రా 

రాజ్‌తరుణ్‌తో తనకు ఎఫైర్ ఉందని లావణ్య ఆరోపించిన నేపథ్యంలో హీరోయి న్ మాల్వి మల్హోత్రా స్పందించారు. రాజ్‌తరుణ్‌తో తాను కలిసి నటించానే తప్ప, అంత కంటే అతడి గురించి ఏమీ తెలియదని స్పష్టం చేశారు. లావణ్య ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని వెల్లడించారు. ఆమె ఎందుకు అలా చేస్తుందో తెలియదని పేర్కొన్నారు. లావణ్యను తన కుటుంబానికి చెందిన ఎవరు కూడా  బెదిరించలేదని చెప్పారు. పైగా ఆమెనే తమ ను బెదిరిస్తోందని, లావణ్యపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వివరించారు.