calender_icon.png 10 January, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్ట్ హత్యకేసులో ట్విస్ట్

05-01-2025 01:46:54 AM

* కుట్రలో భాగమైన అతడి సోదరుడు

న్యూఢిల్లీ, జనవరి 4: జర్నలిస్ట్ ముఖేశ్ చంద్రకర్‌కు వరుసకు సోదరుడైన వ్యక్తి ఈ హత్యకేసులో కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బీజాపూర్‌కు చెందిన ముఖేశ్ టీవీలో పనిచేస్తూనే.. సొంతంగా బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ చానెల్ నడుపుతున్నాడు.

1న వెళ్లిన అతడు ఇంటికి రాకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టి.. ఫోన్ లాస్ట్ లొకేషన్ ఆధారంగా బీజాపూర్‌లోని చట్టాన్‌పారా ప్రాంతంలో కాంట్రాక్టర్ సురేశ్ చంద్రకర్ ఇంటి ఆవరణలో సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని గుర్తించారు. ముఖేశ్‌కు వరుసకు సోదరుడైన రితేశ్  హత్యకేసులో కీలకంగా వ్యవహరించినట్లు  తెలుస్తోంది.