calender_icon.png 23 February, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగన్నాధపురం పాఠశాలలో కవలల దినోత్సవం

22-02-2025 10:47:35 PM

పాల్వంచ,(విజయక్రాంతి): ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా పాల్వంచ మండలంలోని జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో శనివారం కళల కవలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు పాఠశాల హెడ్ మాస్టర్ చెల్లూరి రమాదేవి కూడా కవలగా జన్మించడంతో ఆ పాఠశాలలోని ముగ్గురు కవల పిల్లలతో కలిసి కవలల దినోత్సవం జరుపుకున్నారు. పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న జాటోత్ ప్రవళిక,  ప్రణీత, 3వ తరగతి చదువుతున్న కందుకూరి రుష్మంత్ , రేవంత్, మాలోత్ చరణ్, చరణ్ రాజ్ లతో కలిసి హెడ్మాస్టర్ రమాదేవి కేకులు కట్ చేసి  విద్యార్థులకు స్వీట్లు,  చాక్లెట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు భానోత్ శ్రీనివాస్, వై వెంకటేశ్వర్లు, సుజాత విద్యార్థుల తల్లిదండ్రులు శిరీష,  నజీమా , మహాలక్ష్మి,  వెంకటమ్మ , మణికుమారి తదితరులు పాల్గొన్నారు.