calender_icon.png 10 March, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

108 లో కవలలు పుట్టారు

09-03-2025 08:41:47 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన గర్భిణీ హారిక డెలివరీ కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా గర్భిణీ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మంచిర్యాలకు రిఫర్ చేశారు. 108 అంబులెన్స్ లో అసిఫాబాద్ నుండి మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో గర్భిణికి పురిటినోప్పులు ఎక్కువ అవ్వడంతో 108 సిబ్బంది డెలివరీ చేశారు. ఇద్దరు కవల (ఆడ) పిల్లలు జన్మించారు. ప్రస్తుతం బాలింత, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు టెక్నీషియన్ వెంకటేష్, పైలట్ కార్తీక్ తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.