calender_icon.png 12 March, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబులెన్స్ లో కవల పిల్లలు జననం

11-03-2025 11:22:20 PM

చర్ల (విజయక్రాంతి): ఏజెన్సీలోని అటవీ గ్రామాల గిరిజనులకు రహదారి మార్గం సరిగా లేకపోవడంతో ఈ ప్రాంతపు వాసులు ఆస్పత్రికి చేరుకోవాలంటే కాస్త సమయం పడుతుంది అటువంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ నిండు గర్భిణీ ఎం మళ్లీ(24) భర్త భీమయ్య సుమారు 11 గంటల సమయంలో అంబులెన్స్ కి కాల్ చేసి వాహనం ద్వారా సత్యనారాయణపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో 12 గంటల 47 నిమిషాల సమయంలో గర్భిణీ స్త్రీ కి పురిటీ నొప్పులు రావడం ఇద్దరు పండంటి కవల ఆడపిల్లలకు అంబులెన్స్ లోనే  జన్మనివ్వటం జరిగింది. ఈఎంటి పి సుజాత, పైలట్ సర్వేష్ లు హుటాహుటిన అంబులెన్స్ (నెంబర్ TS28TA8453) ద్వారా సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొనగానే సత్యనారాయణపురం వైద్యులు డాక్టర్ దివ్య నయన, డాక్టర్ నగేష్ లు పిల్లల ఆరోగ్య స్థితిని పరీక్షించి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ దివ్య నయన తెలియజేశారు.