calender_icon.png 24 November, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్కోటిక్, కాచిగూడ పోలీసుల జంట ఆపరేషన్

24-11-2024 01:25:59 AM

గంజాయి సరఫరా ముఠా సభ్యుల అరెస్ట్

114 కిలోల గంజాయి స్వాధీనం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 23(విజయక్రాంతి): హెచ్‌న్యూ(హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్), కాచిగూడ పోలీసులు జంటగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్  ఒడిశా సరిహద్దు నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్న ఏడుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు గంజాయి సరఫరాదారులు, ముగ్గురు విక్రేతలు ఉన్నారు. వారినుంచి 114కిలోల గంజాయి,  రూ.౩వేల నగదు, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీసీపీ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లికి చెందిన ప్రకాశ్‌కుమార్, మోహన్‌రావుకు ఒడిశా సరిహద్దులోని గోవింద్‌తో సంబంధాలున్నాయి. అతడితో కలిసి రూ.1,500 కిలో చొప్పున గంజాయిని కొని రూ.5 వేలకు కిలో చొప్పున వారు అమ్మేవారు. ఈ క్రమంలో గంజాయిని రూ.10 వేలకు కిలో చొప్పున కమీషన్‌పై అమ్మేందుకు గంగాధర్‌ను వారు నియమించుకున్నారు. అలాగే హైదరాబాద్ పరిసరాల్లో రూ.25వేలకు కిలో చొప్పున బాలాజీ, కుమారిను నియమించుకున్నారు. వీరు కొన్ని నెలలుగా చైన్ సిస్టమ్‌లో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.