రంగారెడ్డి (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో జంట హత్యలు కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగిల్ల గ్రామానికి చెందిన బర్కం యాదయ్య (58) పదేళ్ల క్రితం భార్య హత్య కేసులో పదేళ్ళు జైలు కెళ్ళి ఏడాది క్రితం విడుదల అయ్యాడు. అప్పటి నుంచి తన ఇంటి వద్దే ఉంటున్నాడు. అదివారం యాచారం మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన శ్రీను నాగిల్ల గ్రామంలో ఓ శుభకార్యంకు వచ్చాడు. అయితే యాదయ్యకు వరుసకు బామర్ది అయిన శ్రీను గ్రామంలో ఉండే బావను మందలించెందుకు యాదయ్య ఇంటికి వెళ్లినట్లు సమాచారం.
ఇదే సమయంలో బామర్దిని మందలించి కూర్చో ఆని చెప్పి ఇంట్లొకి వెళ్ళిన యాదయ్యా పదునైన ఆయుధంతో శ్రీనుపై దాడి చేశాడు. దీంతో శ్రీను అక్కడిక్కడే చనిపొయ్యాడు. ఇట్టి విషయం ఆదివారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూడడంతో బంధువులు.. ఆగ్రహానికి గురై యాదయ్యపై దాడి చేయడంతో యాదయ్య అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకొన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాఫ్తు చెప్పట్టారు.