calender_icon.png 26 January, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలుశిక్ష

25-01-2025 12:00:00 AM

ఎల్బీనగర్: బాలాపూర్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి కోర్టు ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత తెలిపిన వివరాలు.. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలుడిని అపహరించి, అసభ్యంగా ప్రవర్తించి అసహజ రీతిలో లైంగిక దాడికి పాల్పడిన సంఘటనపై 2020లో కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లోని వెంకటాపూర్ లో నివాసం  ఉంటున్న  మహమ్మద్ అఖిల్ (20) పెయింటర్ పని చేస్తున్నాడు.

కాగా, అఖిల్ ఒక మైనర్ బాలుడిని కిడ్నాప్ చేసి,  అసభ్యంగా ప్రవర్తించి అసహజ రీతిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 2020లో బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, అఖిల్ ను రిమాండ్ తరలించారు. 

కేసును ఎల్బీనగర్ లోని ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించింది. ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయ మూర్తి కేసును విచారించి నిందితుడు  అఖిల్‌ను దోషిగా నిర్ధారించారు. కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన జైలుశిక్ష, రూ.16వేల  జరిమానా విధించారు. బాధిత బాలుడికి రూ.5లక్షల పరిహారం అందించింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సునీత వాదనలు వినిపించారు.