calender_icon.png 17 November, 2024 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22 నుంచి గోధ్వజ్ స్థాపక యాత్ర

09-09-2024 05:45:44 AM

  1. గోపత్రిష్ఠ ఆందోళన్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల రాజధానుల పర్యటన
  2. జ్మోతిర్మఠ్ శంకరాచార్య స్వామిజీ అవిముక్తేశ్వరానంద సరస్వతి నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): సనాతన ధర్మంలోని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు సహా సకల ధర్మ శాస్త్రాలు గోమాత మహ త్యాన్ని తెలియజేస్తాయి. గోవును జంతువుగా కాకుం డా మాతగా పూజిస్తారు. అందుకే సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు గోవును పవిత్రంగా భావిస్తారు. ఈ మతపరమైన విశ్వాసాన్ని గౌరవించి ఆవు ను రాష్ట్ర జాబితా నుంచి తొలగించి కేంద్ర జాబితాలో చేర్చాలనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగం, చట్టాలలో గోమాతకు ప్రాధాన్యం కల్పించి పశు సూచిక నుంచి దేశమంతా సంపూర్ణంగా గోమాతగా గౌరవించాలనే ఉద్దేశంతో గో ప్రతిష్ఠ ఆందోళన్‌ను నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన నాటి నుంచి నిరంతరం గోమాత ప్రతిష్ఠ, రక్షణ కోసం కృషి జరుగుతోంది. 1966లో యతిచక్రచూడామణి ధర్మ్‌సామ్రాట్ కర్‌పాత్రీజీ మహారాజ్ నిర్దేశంతో గోరక్షా ఆందోళన్ మొదలైంది.

ఈ ఆందోళనలో భాగంగా వేలాది మంది గోరక్షకులు బలిదానమయ్యారు. ఇందులో భాగంగా గోకథాకారుడు గోపాల్‌మణిజీ గోప్రతిష్ఠ ఆందోళనను దేశమంతా వ్యాప్తి చేసేందుకు నాలుగు పీఠాల శంకరాచార్యుల ఆశీర్వాదం పొందారు. ప్రయాగ్‌రాజ్ వేదికగా శంకరాచార్యులు గోవును దేశమాతగా గౌరవించడంతో పాటు గోహత్యను నిర్మూలన సహా 21 ఆదేశాలను జారీ చేశారు. ఈ గోప్రతిష్ఠ అభియాన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జోతిర్మఠ్ జగద్గురు శంకరాచార్య స్వామిజీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఈ ఆందోళనకు దిశానిర్దేశం చేశారు. అవిముక్తేశ్వరానంద స్వామిజీ 2024 మార్చి 14 నుంచి మార్చి 28 వరకు గోవర్ధన్ నుంచి ఢిల్లీ వరకు పాదరక్షలు లేకుండా పాదయాత్ర నిర్వహించారు.

ఈ యాత్రలో దేశవ్యాప్తంగా సాధువులు, గోభక్తులు పాల్గొన్నారు. యాత్రలో భాగంగా 1966లో గోసంరక్షణ కోసం బలిదానం చేసినవారికి గోభక్త్ స్మారక సంసద్ భవన్‌లో శ్రద్ధాంజలి ఘటించారు. అవిముక్తేశ్వరానంద నిర్దేశంతో ప్రస్తుతం గోప్రతిష్ఠ ఆందోళన్ నిరంతరం కొనసాగుతోంది. ఈ ఏడాదిని గోసంవత్సరంగా స్వామిజీ ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో చాతుర్మాస మహామహోత్సవ్ ఆగస్టులో నిర్వహించారు. గోరక్షణ ఆందోళనలో భాగంగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 26 వరకు గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రను శంకరాచార్య స్వామీజీ నిర్వహించాలని నిర్ణయించారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల్లో స్వామీజీ పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ప్రతి రాజధాని నగరంలో ఒక గో ధ్వజాన్ని స్థాపిస్తారు. ఈ యాత్ర గోమాత రాష్ట్రమాత. రాష్ట్రమాత  భారత్‌మాత అనే నేపథ్యంగా సాగనుంది. 

1. అయోధ్య (22-09-2024)

2. లక్నో (యూపీ) (23-09-2024)

3. బీహార్ (24-09-2024)

4. సిక్కిం (25-09-2024)

5. అస్సాం (26-09-2024)

6. నాగాలాండ్ (28-09-2024)

7. మణిపూర్ (29-09-2024)

8. త్రిపుర (01-10-2024)

9. పశ్చిమబెంగాల్ (04-10-2024)

10. జార్ఖండ్ (05-10-2024)

11. ఒడిశా (06-10-2024)

12. ఛత్తీస్‌గఢ్ (07-10-2024)

13. మధ్యప్రదేశ్ (08-10-2024)

14. తెలంగాణ (09-10-2024)