calender_icon.png 15 November, 2024 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

22 మంది రెబల్స్‌పై వేటు

12-11-2024 12:15:23 AM

మహారాష్ట్ర ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం

ముంబై, నవంబర్ 11: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపిస్తూ 22 మంది రెబల్స్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన 22 మంది అభ్యర్థులు.. టికెట్ దక్కకపోవడంతో.. ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి అధికారిక అభ్యర్థులపై పోటీచేసేందుకు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం ఆ నేతలను సస్పెండ్ చేసింది. ఏఐసీసీ రమేశ్ చెన్నితాల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ తెలిపింది.

సస్పెండ్ అయినవారిలో రామ్‌టెక్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి రాజేంద్ర ములక్, కటోల్ నుంచి యాజ్ఞవల్క్ జిచ్కర్, కస్బా నుంచి కమల్ వ్యావరే, కోప్రి పచ్చడి నుంచి మనోజ్ షిండే వంటి ప్రముఖ నేతలు ఉన్నారు.