calender_icon.png 16 January, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ 1,000 అత్యుత్తమ కంపెనీల్లో 22 భారతీయ సంస్థలు

15-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: ప్రముఖ టైమ్స్‌మ్యాగజైన్ 2024 సంవత్సరానికి ఎంపికచేసిన ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో 22 భారతీయ కంపెనీలు చోటుదక్కించుకున్నాయి. ‘టైమ్స్ బెస్ట్ కంపెనీస్ 2024’ పేరిట విడుదల చేసిన జాబితాలో  ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, అదానీ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర భారతీయ కంపెనీలు ఉన్నాయి. ఆదాయ వృద్ధి, ఉద్యోగుల సంతృప్తి, నిలకడ తదితర అంశాల ఆధారంగా ఉత్తమ కంపెనీలను టైమ్స్ ఎంపిక చేసింది. భారతీయ కంపెనీల్లో అన్నింటికంటే అధికంగా హెచ్‌సీఎల్ టెక్ 112 ర్యాంక్‌లో నిలిచింది.

తదుపరి స్థానాల్లో ఇన్ఫోసిస్ (119), విప్రో (134)లు ఉన్నాయి.  అదానీ గ్రూప్ 736 ర్యాంక్‌లో ఉండగా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 646 ర్యాంక్‌లో నిలిచింది. ఈ జాబితాలో చోటుచేసుకున్న ఇతర భారతీయ సంస్థల్లో మహీంద్రా గ్రూప్ (187), లార్సన్ అండ్ టుబ్రో (549), ఐటీసీ (586), హీరో మోటో కార్ప్ (597)లు ఉన్నాయి. భారతీయ బ్యాంక్‌ల్లో యాక్సిస్ బ్యాంక్ 504వ ర్యాంక్‌తో ప్రధమస్థానంలో ఉండగా, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 518వ ర్యాంక్ పొందింది. తదుపరి ర్యాంక్‌ల్లో ఐసీఐసీఐ బ్యాంక్ (525), కోటక్ మహీంద్రా బ్యాంక్ (551), యస్ బ్యాంక్ (783), బ్యాంక్ ఆఫ్ బరోడా (850)లు ఉన్నాయి. పీఎస్‌యూల్లో ఎన్టీపీసీ (752), బీఈఎల్ (987)లు టాప్ 1000లో చోటు సంపాదించాయి.