calender_icon.png 17 April, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24 గంటల నిరంతర విద్యుత్ లక్ష్యం

07-04-2025 12:29:05 AM

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

టేక్మాల్, ఏప్రిల్ 6: ప్రజారోగ్య పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటూ, సంక్షేమ పాఠశాలల్లో  నాణ్యమైన మెనూ, జిల్లాలో నిరంతర విద్యుత్ అందించడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం టేక్మాల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్  సుడిగాలి పర్యటన నిర్వహించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు పట్టిక, ఓపి రిజిస్టర్ మందులు నిల్వ చేయి స్టోర్ రూమ్ సంబంధిత వాటిని పరిశీలించి ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు మెరుగైన వైద్య అందించాలని సూచించారు.

అనంతరం కస్తూర్భాగాంధీ విద్యాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూ పరిశీలిస్తూ విద్యార్థులను ప్రశ్నలతో , జవాబులతో సామర్థ్యాలను పరీక్షించారు. అలాగతే మండల కేంద్రంలో 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించి మండల కేంద్రంలో ఎన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుంది 24 గంటలు విద్యుత్ అందించడానికి మీ శాఖ ద్వారా తీసుకున్న చర్యలు, ఓవర్ లోడింగ్ , సంబంధించిన విషయాలను విద్యుత్ శాఖ అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.