calender_icon.png 22 February, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ ప్రాంత పేదల ‘కంటి వెలుగు’

19-02-2025 12:13:39 AM

నేడు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి 14వ వార్షికోత్సవం 

13 ఏళ్లలో 25 వేల ఉచిత కంటి ఆపరేషన్లు

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) : రాష్ర్టంలో ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో ఇబ్బంది పడవద్దనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామీణ ప్రాంత ప్రజల కు కంటి వెలుగుగా నిలిచిం ది. పాల్వంచలోని నవ లిమి టెడ్ సహకారంతో నవ నగర్‌లో 2011 ఫిబ్ర వరి 19న ఈ సంస్థను నెలకొ ల్పారు. అప్పటి నుంచి ఇప్ప టివరకు ఈ సంస్థ ఆధ్వర్యంలో 4.80 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 50 వేల మందికిశస్త్ర చికిత్సలు నిర్వహించారు.

వారిలో 25వేల మందికి ఉచితంగా శస్త్ర చికిత్స చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అనునిత్యం 200 మందికి పైగా జిల్లా నుంచి కాకుండా పొరుగు జిల్లాల నుంచి కంటి వ్యాధిగ్రస్తు లు ఈ ఆసుపత్రికి వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకుంటారు. ఆర్థిక స్తోమత లేకుండా నిరుపేదలైన వారికి పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు చేసి వారికి చూపు ప్రసా దించడం వీరి  లక్ష్యం. ఆసుపత్రిలో అధు నాతనమైన సుమారు కోటి విలువగల ఎక్విప్మెంట్‌తో కంటి ఆపరేషన్లు నిర్వహి స్తుంటారు.

హైదరాబాదు వంటి నగరా లతో సమానంగా కంటి పరీక్షలు నిర్వహిం చి, శస్త్ర చికిత్సలు చేయడంతో విశేష ఆదరణ పొందండి. సంపన్నుల నుంచి, సామాన్యుల వరకు ఇక్కడే కంటి వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ కేంద్రానికి అనుసంధానంగా జిల్లా వ్యాప్తంగా 10 సబ్ సెంటర్లను ఏర్పాటు చేసి మారుమూల గ్రామాలకు సైతం సేవలను విస్తృత పరుస్తున్నారు.

నిరుపేదలకు ఉచిత వైద్యం 

కంటిచూపు తగ్గి, రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా నిర్వ హిస్తున్నామని, వారికి సైతం కార్పొరేట్ స్థాయిలో తక్కువ ఖర్చుతో అన్ని రకాల కంటి పరీక్షలు అందజేస్తున్నామన్నారు.

- దేవీచందర్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి