calender_icon.png 2 April, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ కార్లపై 25శాతం సుంకాలు

28-03-2025 01:00:16 AM

తేలికపాటి ట్రక్కులకూ వర్తింపు

ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 

వాషింగ్టన్, మార్చి 27: అమెరికాకు దిగుమతయ్యే విదేశీ కార్లు, తేలికపాటి ట్రక్కులపై 25శాతం సుంకం విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని, ఏప్రిల్ 3 నుంచి సుంకాలను వసూ లు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ‘అమెరికాలో తయారు చేయని అన్ని కార్లపై 25శాతం సుంకం విధిస్తున్నాం. ఇక్కడ తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఏప్రిల్ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తా‚యి’ అని వైట్‌హౌస్‌లో ట్రంప్ వెల్లడించారు. ఇదే సమయంలో చైనాకు ట్రంప్ ఆఫర్ ప్రటికంచారు. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను విక్రయిస్తే టారిఫ్‌లు తగ్గించే అవకాశం ఉందన్నారు. అవసరమైతే ఒప్పంద గడువును కూడా పెంచుతానన్నారు. 

భారత్‌పై మా వైఖరి అలా ఉండదు

భారత్ అమెరికాల మధ్య వాణిజ్యపరమైన ఒప్పందానికి సంబంధించిన చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. చైనా, కెనడా, మెక్సికోలతో కలిపి భారత్‌ను చూడబోమని అమెరికా పేర్కొంది. ‘ట్రంప్ పరిపాలనలో చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలతో భారత్‌ను కలిపి చూడటం లేదు. ఆయా దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వసలు, ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయి. కానీ న్యూఢిల్లీతో టారిఫ్ సమస్య మాత్రమే ఉంది. వీటిని ఇరుదేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాం. రెండు దేశాల ప్రభుత్వాలకు సంతృప్తికరమైన ఫలితం ఉంటుందని అనుకుంటున్నాం’ అని చర్చల్లో పాల్గొన్న ఓ అధికారి మీడియాకు తెలిపారు. కాగా మూడు రోజుల్లో వాణిజ్యంపై ఇరుదేశాల మధ్య తుది ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.