calender_icon.png 17 November, 2024 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిశాపటానీ తండ్రికి 25లక్షల టోకరా

17-11-2024 01:30:02 AM

ఉన్నత ఉద్యోగం ఆశచూపి డబ్బుకాజేసిన నేరగాళ్లు

బరేలీ, నవంబర్ 16: ప్రముఖ బాలీవుడ్ నటి దిశాపటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీష్ సింగ్ పటానీకి ఉన్నత పదవి ఇప్పిస్తామని చెప్పి కొందరు రూ.25లక్షలు కాజేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బరేలీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో జగదీప్ సింగ్ పటానీ ఫిర్యాదు చేశారు. బరేలీలోని సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన జగదీష్ పటానీ గతంలో డిప్యూటీ ఎప్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఉంటున్నారు.

ఈయనకు వ్యక్తగతంగా తెలిసిన శివేంద్ర ప్రతాప్ సింగ్.. దివాకర్ గార్గ్, ఆచార్య జయప్రకాశ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేశాడు. తమకు చాలా పొలిటికల్ పరిచయాలున్నాయని.. ప్రభుత్వంలో ఏదైనా శాఖలో చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవి ఇప్పిస్తామని నమ్మబలికారు. వీరిని నమ్మిన జగదీష్ పటానీ.. మొదట రూ.5లక్షలు, ఆ తర్వాత రూ.20లక్షలు మొత్తంగా రూ.25లక్షలను నిందితుల అకౌంట్లలో వేశారు. డబ్బులు కట్టి మూడు నెలలు కావస్తున్నా వారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో పాటు వారిని జగదీష్ నిలదీశాడు.

ఈ క్రమంలో వారు  జగదీష్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. వారు ఫ్రాడ్స్ అని గుర్తించిన జగదీశ్ సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.