లడ్కీ బెహన్ పథకం రూ.1500 నుంచి రూ.2,100కు పెంపు
2027 నాటికి రాష్ట్రంలో 50లక్షల మంది మహిళలను లక్షాధికారుల్ని చేయడం.
వ్యవసాయ రుణాల మాఫీతో పాటు ఆహార భద్రతకు హామీ.
వృద్ధాప్య పింఛన్ రూ.2,100కు పెంపు.
యువతకు 25లక్షల కొత్త ఉద్యోగాల కల్పన, పది లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10వేల భృతి
పునరుత్పాదక ఇంధనంపై దృష్టి
సారిస్తూ విద్యుత్ బిల్లులను 30శాతం వరకు తగ్గింపు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విజన్ మహారాష్ట్ర 2028 విడుదల.
వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఆర్థిక సాయం,
ప్రజలకు ఆరోగ్య బీమా.
నిరుద్యోగులకు 10వేల భృతి
మహారాష్ట్రలోట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
‘సంకల్ప్ పత్ర’ పేరుతో బీజేపీ హామీలు
ముంబై, నవంబర్ 10:మహారాష్ట్రను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మరో 10 రోజు ల్లో మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో ‘సం కల్ప్ పత్ర’ పేరుతో ఆదివారం ముంబైలో బీజేపీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాయుతి ప్రభుత్వం రైతులు, పేదలు, మహిళల గౌరవం కోసం పని చేసిందన్నారు. తమ మ్యానిఫెస్టో మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
కొన్నేళ్లుగా మహారాష్ట్ర దేశానికి నాయకత్వం వహిస్తోందన్నారు. భక్తి ఉద్యమం ఇక్కడి నుంచే మొద లైందని, బానిసత్వానికి వ్యతిరేకంగా శివాజీ మహారాజ్ ఇక్కడి నుంచే ఉద్యమాన్ని మొదలుపెట్టినట్టు గుర్తు చేశారు. అనంతరం మ హావికాస్ అఘాడీపై షా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చే ముం దు ఆలోచించాలని సూచించారు. ఎందుకంటే వాళ్లు హామీలు ఇచ్చిన తర్వాత సమా ధానాలు చెప్తారని దుయ్యబట్టారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకల్లో ప్రజల కు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాం కులే పాల్గొన్నారు.