సరస్వతి నిలియంగా మంథని ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం
మంథని మండలం అడవి సోమనపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శంకుస్థాపనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
మంథని (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా 28 స్కూల్స్ ప్రారంభిస్తామని, సంవత్సరానికి 5 వేల మంది విద్యార్థులకు గురుకులాల ద్వారా ఉచిత విద్య అందిస్తామని, మంత్రి ప్రాంతాన్ని సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపెల్లి జిల్లా మంథని మండలంలోని అడవి సోమనపల్లి గ్రామంలో తెలంగాణ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఉన్నత విద్య అందించడం కోసం గురుకులాల ఏర్పాటు చేశామని, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, పది నెలల కాలంలో అనేక పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నమని, ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని, వచ్చే నెల నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తామని, గత ప్రభుత్వ హయాంలో అభివృద్ది సరిగా జరగలేదని, విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి విద్యా కమీషన్ ఏర్పాటు చేశామని, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో కుల మత బేధం ఉండకూడదని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేసి నూతన విద్యా విధానంలో విద్యార్థులకు విద్యా బోధన చేస్తామని, 2026 లో భవన నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామని, సరస్వతి నిలయంగా ఎదగాలి మంచిగా చదువుకొని సమాజంలో ఉన్నత గుర్తింపు తెచ్చుకోవాలని మంత్రి అన్నారు.