calender_icon.png 29 March, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీ నగుమోము కనులారా చూస్తుంటే..

22-03-2025 12:00:00 AM

‘పొలిమేర’ చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ ప్రస్తుతం ‘28 c’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ క్రమంలోనే మంచి ఎమోషనల్ గా సాగే అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించారు. ఈ చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మించారు. నేడు ఈ సినిమా నుంచి ‘చెలియా చెలియా..’ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను శ్రావణ్ భరద్వాజ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా... కిట్టు విస్సాప్రగడ మంచి లిరిక్స్ అందించారు.

సింగర్ రేవంత్ ఆకట్టుకునేలా పాడారు. ‘నీ నగుమోము కనులారా చూస్తుంటే క్షణమైనా.. కనురెప్ప వాలేనా.. నా కనుసైగ నీ వెనకా వెంటాడే మౌనంగా.. వేచిందే నువు రాక, ఊహలలో ఊరిస్తూ..’ అంటూ ఈ పాట మంచి లవ్ ఫీల్ తో సాగుతుంది. మనసును తాకే భావోద్వేగాలతో ఆద్యంతం సాగే అద్భుతమైన ప్రేమ కథా చిత్రం ఇదని దర్శకుడు అనిల్ విశ్వనాథ్  తెలిపారు. టెంపరేచర్ అనేది కీ రోల్ పోషిస్తుంది. ఒక డిఫరెంట్ స్టోరీ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, హర్ష చెముడు, రాజా రవీంద్ర, అభయ్ బేతిగంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు.