calender_icon.png 24 September, 2024 | 10:00 AM

20 రోజులు హోటల్‌లోనే బందీగా..

09-09-2024 12:15:38 AM

  1. ఇన్‌స్టాగ్రాం పరిచయంతో హైదరాబాద్‌కు బాలిక 
  2. నమ్మించి గదిలో బంధించిన యువకుడు 
  3. తల్లిదండ్రులకు లొకేషన్ షేర్ చేసిన బాధితురాలు 
  4. వారి ఫిర్యాదుతో కాపాడిన షీటీం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతిని.. ట్రాప్ చేసిన ఓ యువకుడు నగరంలోని ఓ హోటల్ రూంలో 20రోజుల పాటు బంధించిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. సైబర్ క్రైమ్స్, వుమెన్ సేఫ్టీ పోలీసులు తెలిపిన వివరాల.. నిజామాబాద్ జిల్లా భైంసాకు చెందిన ఒక విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఒక వ్యక్తి ట్రాప్‌లో పడి 20రోజులుగా హోటల్‌లో బందీగా ఉన్నట్లు తన తల్లిదండ్రులకు వాట్సప్ లొకేషన్ ద్వారా తెలిపింది.

ఆమె తల్లిదండ్రులు వెంటనే షీటీం పోలీసులను సంప్రదించారు. లొకేషన్ ఆధారంగా ఆ యువతి నారాయణగూడలోని ఒక హోటల్‌లో తాళం వేసి ఉన్న రూంలో ఉన్నట్లు గుర్తించిన షీటీం పోలీసులు ఆమెను రక్షించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై 304/2024 యూ/ఎస్ 64(2)(ఎం), 127(4), 316(2)భారత్ న్యాయ సంహిత సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. 

మరో ఘటనలో..

సహవిద్యార్థులు తనను వేధిస్తున్నారని నగరంలోని ఒక అకాడమీలో చదువుతున్న విద్యార్థిని షీటీమ్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఆమెను వేధిస్తున్న విద్యార్థులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది.