ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (విజయక్రాంతి): మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన 12వ సీఎన్‌సీ ఎక్స్‌పోను బుధవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఓటీటీ, ఐఓటీలకు ఒకే వేదికగా నిలుస్తున్న సంస్థ సీఎన్‌సీ ఎక్స్‌పో అన్నారు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నూతన వస్తువుల పట్ల అవగాహన పెంచుకోవడానికి సీఎన్‌సీ ఎక్స్‌పో ఎంతగానో దోహద పడుతుందన్నారు. 300కు పైగా బ్రాండ్స్‌తో 200కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎగ్జిబిషన్‌కు ఏటా 30 వేల మంది సందర్శకులు వస్తుండటం గొప్ప విషయమని చెప్పారు. ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసిన సీఎన్‌సీ ఎక్స్‌పో సీఈవో పల్లా రాము ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సీఎన్‌సీ ఎక్స్‌పో ప్రతినిధులు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు జ్ఞాపికను బహూకరించారు.