calender_icon.png 2 February, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వాదశ రాశిఫలాలు

02-02-2025 12:34:55 AM

2.-2.-2025 నుంచి 8.-2.-2025 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి :

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి శుభంగా ఉంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో ఉన్నతిని పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. పనులలో జాగ్రత్త అవసరం. ధనవ్యయమవుతుంది. బంధువులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి. యువతీ యువకులకు పెండ్లి విషయంలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చికాకుగా ఉంటారు. విదేశీ ప్రయత్నాలు ఫలించవు. రైతులకు లాభాలు ఉండవు.- ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. -మొత్తం మీద ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది. 

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. పనులు మందకొడిగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు చేస్తారు. అధిక ధనవ్యయం అవుతుంది. బంధుమిత్రులతో స్పర్ధలు ఏర్పడతాయి. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులు చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. పనులు మెల్లగా పూర్తవుతాయి. శుభ కార్యక్రమాలు చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందరితో ఆనందంగా ఉంటారు. యువతీ యువకులకు అనుకున్న వారితో వివాహాలు జరుగుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. ధనాదాయం స్థిరంగా ఉండదు. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. అశాంతిగా ఉంటుంది. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు లాభించవు. విద్యార్థులకు చదువులలో అనాసక్తి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. లాభాలు కలుగుతాయి. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు అనుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.

తుల

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచి పనులు చేస్తారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. చేసే పనులు కలిసివస్తాయి. పేరు పొందుతారు. యువతీ యువకులకు వివాహ విషయంలో ఆలస్యమవుతుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. పనులు అనుకూలిస్తాయి. ఆరోగ్య విషయమై కొంత ఇబ్బంది ఉంటుంది. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు పెళ్లి ప్రయత్నాలు ఫలించవు. విద్యార్థులకు చదువులలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు మంచివారితో వివాహం జరుగుతుంది. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. పనులు ఆలస్యమ వుతాయి. బంధువులతో వైరం ఏర్పడుతుంది. జాగ్రత్త అవసరం. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు వివాహ విషయంలో జాప్యం జరుగుతుంది.- విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. పనులు ఆలస్యమవుతాయి. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. మిత్రులతో విరోధం కలుగుతుంది. ధనవ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులకు చికాకు, అశ్రద్ధ ఉంటాయి. వ్యాపారస్తులకు, రైతులకు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. పనులలో ఆటంకాలు కలుగుతాయి. ధనవ్యయం అవుతుంది. బంధువులతో భేదాలు కలుగుతాయి. దూరప్రయాణాలు చేస్తారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రయా ణాలు చేస్తారు. యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో స్తబ్దంగా ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.