calender_icon.png 12 January, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వాదశ రాశిఫలాలు

12-01-2025 12:18:13 AM

12-.1.--2025 నుంచి 18.-1.-2025 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. చేసే పనులు సంతృప్తికరంగా ఉంటాయి. ధనలాభాలు సిద్ధిస్తా యి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. యువతీ యువకులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పెండ్లి సంబంధాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులు సంతోష వార్తలు వింటారు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉం టారు. రైతులు సంతోషిస్తారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉం ది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువ కులకు ఉద్యోగ, పెండ్లి విషయాలలో ఆలస్యమవుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు విదేశీయానం ఫలిస్తుంది. రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి.- ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.- మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.

మిథునం

--ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. అశాంతిగా ఉంటారు. ధన వ్యయమవుతుంది. అకాల భోజనం చేస్తారు. ఇంట్లో బంధువులతో సందడిగా ఉం టుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత అవసరం. యువతీ యువకులకు ఉద్యో గ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో సా మాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు విం టారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. పెద్దవారితో పరిచయాలు కలుగుతాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. శుభ కార్యక్రమాలు చేస్తారు. కొందరితో భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహాలలో స్తబ్దత ఉం టుంది. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులు సంతోష వార్తలు విం టారు. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొ త్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. జాగ్రత్త అవసరం. మనసు అశాంతిగా ఉం టుంది. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి. చేసే పనులలో సమస్యలు ఏర్పడతాయి. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో స్తబ్దత ఏర్పడుతుంది. వ్యాపా రస్తుల కు, రైతులకు జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. అభివృద్ధికర పనులు చేస్తా రు. శుభవార్తలు వింటారు. కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు ఉద్యోగం, కోరుకున్న వారికి వివాహ నిశ్చయాలు జరుగుతాయి. విద్యార్థులకు శుభం జరుగుతుంది. వ్యాపార స్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది. 

తుల

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఉత్సాహంగా ఉంటారు. శారీరక, మానసిక అనారోగ్యాలు కలుగు తాయి. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు. ధనలాభం కలుగుతుంది. బంధువులతో స్పర్ధలు కలుగు తాయి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యో గ, వివాహ విషయాలలో పురోగతి ఉం టుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉం టుంది. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది.

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. బంధువులతో భేదం కలుగుతుంది. శుభకార్య విషయంలో ధనవ్యయమవుతుం ది. చేసే పనులు విజయవంతమవుతా యి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉం టుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉం టుంది. ఉద్యోగస్తులకు పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు అనుకూల కాలం కాదు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సంస్కారులతో స్నేహం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో శ్రద్ధ చూపుతారు. వ్యాపారస్తులు, రైతులు చేసే పనులలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పనిభారం ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. శుభవార్తలు వింటారు. చిత్త చపలత ఉంటుంది. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో పురోగతి ఉంటుంది. -విద్యార్థులు పట్టుదలతో చదవాలి. వ్యాపారస్తులు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. శుభవార్తలు వింటారు. స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. బంధువులతో విరోధాలు సంభవిస్తాయి. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉన్నత పురోగతిని పొందుతారు. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ధన లాభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. మనసు అ శాంతిగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. బంధువులతో సఖ్యతగా ఉంటారు. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తుంది. విద్యార్థులకు చదువులలో శ్రద్ధ ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు స్వల్పలాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.