calender_icon.png 23 December, 2024 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వాదశ రాశిఫలాలు

22-12-2024 12:59:09 AM

22.-12.-2024 నుంచి 28-.12-.2024 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి

మేషం

ఈవారంలో ఈ రాశివారికి గ్రహస్థితి అ నుకూలంగా ఉంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలు చేస్తారు. సకా లంలో పనులు పూర్తవుతాయి. స్థిరాస్తులు కొనాలనే ఆలోచన కలుగుతుంది. శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తా రు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవస రం. చిన్ననాటి మిత్రులను కలుస్తారు. యువతీ యువకులకు మంచి వివాహ సంబంధాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు కలుగు తా యి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో ఆసక్తి చూపుతారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మ ధ్యరకంగా ఉంది. ధనవ్య యం అవుతుంది. నిర్ణయాలు తీసుకొనేటప్పుడు జాగ్రత్త అవసరం. చేసే పనులు విజయవంతమవుతాయి. యువతీ యు వకులకు పెండ్లిళ్ల విషయంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యా పారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చికాకుగా ఉంటారు. నిరుత్సాహం కలుగుతుంది. విదేశీ ప్రయత్నాలు ఫలించవు. రైతులకు లాభాలు ఉండవు. -ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. -మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది.-

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అ నుకూలంగా లేదు. అన్ని విషయాలలో జాగ్రత్త అవసరం. చేసే పనులు ఆలస్యమవుతాయి. నమ్మిన వా రు మోసం చేస్తారు. మానసిక అశాం తి ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని భూమి తగాదాలు పరిష్కా రమవుతాయి. బంధుమిత్రులతో స్ప ర్ధలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులు చదువులలో ముం దుంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉంది. కొన్ని విషయాలలో కలిసివస్తుంది. శుభకార్యాలు చేస్తారు. ధనవ్యయమవుతుంది. బంధు విరోధం కలుగుతుంది. స్థిరాస్తులు కొనే ప్రయత్నం చేస్తారు. దేవాలయ సందర్శనలు చేస్తారు. యువతీ యువకులకు అను కున్న వారితో వివాహాలు జరుగుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం

--ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సా మాన్యంగా ఉంది. అశాంతిగా ఉంటుంది. చేసే పనులు కొన్ని అను కూలిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనవ్యయమవుతుంది. యువతీ యువకులకు వివాహ విషయంలో జాప్యం కలుగుతుంది. విద్యార్థులకు చదువులలో పురోగతి ఉంటుంది. వ్యాపా రస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. మంచివారితో స్నేహం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి నిలకడగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు మంచివారితో వివాహం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. -విద్యార్థులు చదువు లలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది. 

తుల

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. కొంత మంచి, కొంత చెడు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. చేసే పనులు ఫలిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శుభవార్తలు విం టారు. ధనవ్యయమవుతుంది. బంధుమిత్రులతో భేదం కలుగుతుంది. యువ తీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో స్తబ్దత ఉంటుంది. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు ప్రతికూల కాలం. మొత్తం మీద ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు చేస్తారు. ధనవ్యయమవుతుంది. శుభవార్తలు వింటారు. చేసే పనులు కలిసివస్తాయి. మానసిక చికాకులు కలుగుతాయి. యువతీ యువ కులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుం ది. విద్యార్థులకు చదువులలో ఆసక్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. సంతోషంగా ఉంటారు. ధనం లభిస్తుంది. శుభకార్యాలు చేస్తారు. చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు మంచివారితో వివాహం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. ధనలాభం కలుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. వాహనాలు కొంటారు. బంధువులతో విరోధం కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.- విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. పెద్దల మాట వినాలి. బంధుమిత్రులతో విరోధం కలుగుతుంది. వేగిర పడి నిర్ణయాలు తీసుకోవద్దు. ధనవ్యయ మవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. కొన్ని శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చికాకు, అశ్రద్ధ ఉంటాయి. వ్యాపారస్తులకు, రైతులకు నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యమంగా ఉంది. చేసే పనులు లాభిస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో భేదాలు కలుగుతాయి. అశాంతిగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. శుభకార్యాల ప్రయత్నం చేస్తారు. ధనవ్యయమవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో పట్టుదల అవసరం. వ్యాపార స్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.