calender_icon.png 18 November, 2024 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 మంది ట్రాన్స్‌జెండర్ల అరెస్ట్

18-11-2024 04:16:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడుతున్న 12 మంది ట్రాన్స్‌జెండర్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సెఫ్టీ వింగ్ డీసీపీ కే సృజన ఆదేశాల మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఇన్‌స్పెక్టర్ జేమ్స్ బాబు తన బృందం సభ్యులతో నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి శనివారం రాత్రి గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

అసభ్యకరంగా వ్యవహరి స్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న 12 మంది ట్రాన్స్‌జెండర్లను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ కే సృజన తెలిపారు.