ఖమ్మం, నవంబర్ 25 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కల్లూరు మండ లం పుల్లయ్యబంజరకు చెందిన మహిళ తన 12రోజుల బ్డిడను తిరుమలాయపాలెం మండలం బీరోలు కు చెందిన మరో మహిళకు రూ.౧.20 లక్షలకు అమ్మకానికి పెట్టింది. ఒప్పందం ప్రకారం బిడ్డను బీరోలు మహిళకు అప్పగిద్దామనుకుంటున్న తరు ణంలో డబ్బు పంపకం విషయంలో వివాదం తల్తెత్తింది.
దీంతో బిడ్డ తల్లిపై ఆమె చెల్లి ఖమ్మం చైల్డ్‌లైన్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఖమ్మం టూటౌన్ పోలీసులు రంగంలోకి దిగి బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లితో పాటు కొనడానికి వచ్చిన మహిళపై కేసు నమోదు చేశారు.