calender_icon.png 13 December, 2024 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనీస వేతన సలహా మండలి సభ్యులుగా 12 మంది

13-12-2024 02:29:52 AM

నియామక ఉత్తర్వులు జారీ చేసిన కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): రాష్ట్ర కనీస వేతన సలహా మండలి సభ్యులుగా 12 మందిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. వీరిలో ఐదుగురు య జమానుల సంఘాల నుంచి, ఐదుగురు కార్మిక సంఘాల నుంచి, ఇద్ద రు స్వతంత్ర సభ్యులు బోర్డులో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం నియామకమైన సభ్యులు రెండేళ్లపాటు పదవీ లో కొనసాగుతారని తెలిపారు. కార్మిక సంఘాల నుంచి యెర్రం పిచ్చిరెడ్డి, నర్సింహారెడ్డి, ఎండీ యూ సుఫ్, నత్తెట్ల రాజు ముదిరాజ్, కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి, యజమానుల సంఘాల నుంచి మీలా జయదేవ్, కశ్యప్‌రెడ్డి, మహిమా దాట్ల, నర్రా రవికుమార్, బాసాని చంద్రప్రకాశ్, స్వతంత్ర సభ్యులుగా సీ రవి, ప్రొఫెసర్ నిముశాకవి వాసంతి సభ్యు లుగా నియామకమయ్యారు. మార్చి నెలలో కనీస వేతన సలహా మండలి చైర్మన్‌గా జనక్‌ప్రసాద్ నియామకం అయిన విషయం తెలిసిందే.