calender_icon.png 5 April, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12 మంది ఏఎస్పీలకు ఎస్పీలుగా ప్రమోషన్స్

17-12-2024 01:49:32 AM

హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 12 మంది నాన్ క్యాడ ర్ అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా రాష్ట్రప్రభు త్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు సోమవారం రాత్రి హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిని ఆయా స్థానాలకు బదిలీ చేస్తూ పోస్టింగు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

జోగుళాలాంబ గద్వాల అడిషనల్ ఎస్పీ కే గుణశేఖర్‌కి మేడ్చల్ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా, సైబరాబాద్ క్రైం అడిషనల్ డీసీపీ జీ నర్సింహారెడ్డికి రాచకొండ డీసీపీగా, సిద్దిపేట లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ ఎస్.మల్లారెడ్డికి రాచకొండ ట్రాఫిక్ డీసీపీగా, హైదరాబాద్ సీటీసీ అడిషనల్ డీసీపీ మద్దిపాటి శ్రీనివాస్‌రావుకు సీఐడీ ఎస్పీగా, సైబరాబాద్ ఎవోటీ అడిషనల్ డీసీపీ పీ శోభన్‌కుమార్‌కు సైబరాబాద్ మాదాపూర్ జోన్ ఎస్వోటీ డీసీపీగా, సైబరాబాద్ మాదాపూర్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ టీ సాయిమనోహర్‌కు అదే స్థానం లో డీసీపీగా, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ డీ రమేశ్‌కు అదేస్థానంలో ఎస్పీగా, మహబూబాబాద్ ఏఎస్పీ జే చెన్నయ్యకు హైదరాబాద్ ఐసీసీసీ ఎస్పీగా, సైబరాబాద్ రాజేంద్రనగర్ జోన్ అడిషనల్ డీసీపీ పీ విజయ్‌కుమార్‌కు సీఐడీ ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. రాచకొండ డీసీపీ పీ కరుణాకర్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. అలాగే రాచకొండ ట్రాఫిక్ డీసీపీ కే మనోహర్‌కు రాచకొండ రోడ్ సేఫ్టీ డీసీపీగా, సైబరాబాద్ మాదాపూర్ జోన్ ఎస్వోటీ డీసీపీ డీ శ్రీనివాస్‌కు సైబరాబాద్ మేడ్చల్ జోన్ ఎస్వోటీ డీసీపీగా పోస్టింగ్ ఇచ్చారు.