చెన్నై: టీవీఎస్ మోటార్స్ కంపెనీ సోమవా రం తన సరికొత్త కింగ్ ఈవీ మ్యాక్స్ త్రీవీలర్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఈ పర్యావరణ అనుకూల వాహనాన్ని కంపెనీ పట్టణ ప్రాంత ప్రయాణికుల కోసం రూపొందించింది. ఇది 51.2వి లిథియం అయాన్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీతో వస్తుంది. సింగిల్ చార్జ్‌పై 179 కిలోమీ టర్లు ప్రయాణిస్తుంది.
కేవలం 2 గంటల 15 నిమిషాల్లో 080 శాతం, 3.5 గంటల్లో పూర్తి గా చార్జింగ్ అవుతుంది. దీని గరిష్ఠ వేగం గంట కు 60 కిలోమీటర్లు. ఈ వాహనంలో రియల్‌టైమ్ డయాగ్నోస్టిక్స్, నావిగేషన్, అలర్ట్స్ కోసం టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ సదుపాయం కూడా ఉంది.
ఈ వాహనాలు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, బీహార్, జమ్మూ, కశ్మీర్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ.2.95 లక్షలు(ఎక్స్ షోరూమ్). ఇది దేశం లో మొట్టమొదటి బ్లూటూత్ గలవిద్యుత్ త్రిచక్ర వాహనమని కంపెనీ తెలిపింది.