22-03-2025 09:33:07 PM
పెన్ పహాడ్: పేద విద్యార్థుల ఆభ్యున్నతి కోసం పాఠశాల పూర్వ విద్యార్థులు చేయూత నివ్వడం అభినందనీయమని ప్రధానోపాధ్యాయులు పిండిగ నర్సయ్య, పిఆర్ టియుటిఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మామిడి వెంకన్న అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా దోసపహాడ్ ప్రాధమికోన్నత పాఠశాల ఫ్రెండ్స్ యూత్ (మేముసైతం) సభ్యులుగా ఉన్న కొండేటి శ్రీకాంత్ రెడ్డి, జూకూరి సతీష్ ల జ్ఞాపకార్థంగా విద్యార్థులకు ఐసిటి పాఠాలు బోధించుటకు రూ.15 వేల రూపాయల టీవీని పూర్వ విద్యార్థులు కలసి ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. దోసపహాడు గ్రామంలోని పూర్వ విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులు, గ్రామస్తులు, పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు కావడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రాయికింది వెంకటేశ్వర్లు, వై వెంకన్న, ఎస్ విప్ల కుమార్, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.