తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ర్ట అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీ
గజ్వేల్, జనవరి 30 : రాష్ర్టవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సం ఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీ అన్నారు. గురువారం గజ్వేల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ సమావేశంలో పాల్గొన్న ఆయన టియూడబ్ల్యూజే డైరీని స్థానిక జర్నలి స్టులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల ను తెలుసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులతో పాటు కార్పొరేట్ ఉచిత వైద్యసేవల కోసం హెల్త్ కార్డులు అంద జేసేందుకు టియుడబ్ల్యూజే ప్రభుత్వంతో చర్చించామన్నారు. గజ్వేల్ ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సత్యనారాయణ, కృష్ణ, జగదీశ్, కిరణ్, మునీర్, యాదగిరి మాట్లాడారు.