08-04-2025 05:38:31 PM
అడ్డాకుల: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకులలో టియుడబ్ల్యు సభ్యత్వాల నమోదు కార్యక్రమం జోరుగా సాగింది. యూనియన్ జిల్లా అడ్ హక్ సభ్యులు బిజీ రామాంజనేయులు, పేట వెంకటయ్య, సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వాల కార్యక్రమం కొనసాగించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన జర్నలిస్టులో యూనియన్ సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల జర్నలిస్టులు జర్నలిస్టుల ఇండ్ల సమస్యను పరిష్కరించాలని జిల్లా కమిటీ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. తామంతా ఐజేయు యూనియన్ ఆధ్వర్యంలోనే కొనసాగుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు రఘు పాల్గొన్నారు.