28-02-2025 10:03:00 PM
త్వరలో జిల్లా మహాసభలు నిర్వహిస్తాం..
రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి..
ఎల్బీనగర్: రంగారెడ్డి జిల్లాలో టీయూడబ్ల్యూజే -ఐజేయూ బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా యూనియన్ కార్యవర్గ సమావేశం తొర్రూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మార్చి 3 వ తేదీ వరకు జిల్లాలో యూనియన్ సభ్యత్వ నమోదు చేపట్టిన తర్వాత జిల్లా మహాసభలు నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభల సందర్భంగా జిల్లాలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న జర్నలిస్టులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, మఫిసిల్ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ గుడిపల్లి శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ జాతీయ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సలీమ్ పాషా, సత్యనారాయణ,జిల్లా ఉపాధ్యక్షులు కటకం సుభాష్, ప్రసాద్, సంయుక్త కార్యదర్శులు జగన్ గౌడ్, రాజేశ్, కోశాధికారి సంరెడ్డి శశిపాల్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పాండు, వెగ్గలం శ్యామ్, బద్ధుల మల్లేశ్ యాదవ్, దర్శనం జంగయ్య, రచ్చ శేఖర్, ఆవంచ సురేందర్ పాల్గొన్నారు.