calender_icon.png 12 January, 2025 | 1:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్ ల ప్రతిబింబాలను కనుమరుగు చేసే ప్రయత్నం.!

11-01-2025 10:19:25 PM

మహాత్మా గాంధీజీ ముని మనవడు తుషార్ గాంధీ

అచ్చంపేట,(విజయక్రాంతి): దేశంలో మహాత్మా గాంధీ(Mahatma Gandhi), డా.బీఆర్ అంబేద్కర్(Dr.B.R Ambedkar)ల ఆశయాలు, ఆదర్శాలను అనుసరించి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ(Mahatma Gandhi Great Grandson Tushar Gandhi) అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో రిటైర్డ్ ప్రొఫెసర్ విజయ్ కుమార్ బాపు(Retired Professor Vijay Kumar Bapu) బాటలో సత్యశోధనా అనే కార్యక్రమం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ వ్యాప్తంగా 100 రోజులపాటు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి వారితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అంతకు ముందు అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి తరం విద్యార్థులకు మహనీయుల జీవిత చరిత్రను పాఠ్యాంశాల తోనే తెలియజేయడం కాకుండా నేరుగా విద్యార్థులతో చర్చించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. మత్తు, డ్రగ్స్ బానిస నుండి బయటికి రావాలని తమ భావి జీవితాన్ని బంగారు మయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలు, యువతి యువకులు, విద్యార్థులకు మహనీయుల ఆశయాలను వ్యాప్తింప చేయాలన్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహనీయుల ఆదర్శాలను ముందుకు తీసుకు వెళ్తూ రాష్ట్రాన్ని విజయపతంలో నడిపించేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, గాంధీ స్మారక నిధి జాతీయ కార్యదర్శి సంజయ్ సింగ, టీ షాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి,  తెలంగాణ గాంధీ స్మారక నిధి అధ్యక్ష కార్యదర్శులు భూదానం సుబ్బారావు, కోదాటి రంగారావు  తదితరులు పాల్గొన్నారు.