12-04-2025 12:46:41 AM
రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో కొమ్మూరి పిలుపు
చేర్యాల, ఏప్రిల్ 11: బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్వేష రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. కొమరవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ముగింపు సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుందన్నారు.
పార్లమెంట్ సాక్షిగా బిజెపి కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను సమర్ధించడం సిగ్గుచేటు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కి విగాథం కలిగించే బిజెపి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గత పది ఏళ్లలో జరగని అభివృద్ధి 16 నెలల్లోని అభివృద్ధి చేసి చూపించమన్నారు.
అదేవిధంగా చేర్యాల పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే 129వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులవ్యవస్థ నిర్మూలన కోసం పోరాడిన గొప్ప యోధుడని ప్రశంసించారు. ఫూలే చేపట్టిన సంస్కరణల లో భాగంగా బాల్య వివాహాలను, మహిళా విద్య తదితర అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కృష్ణ మండలపార్టీ అధ్యక్షులు కొమ్ము రవి, మహాదేవుని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.