calender_icon.png 12 February, 2025 | 5:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందూరు తల్లికి పసుపు పారాణి

12-02-2025 12:22:49 AM

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు పంట 

నిజామాబాద్ ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): నిజామాబాద్ (శ్రద్ధానంద్ గంజ్) వ్యవసాయ మార్కెట్ కమిటీ నిజామాబాద్ మార్కెట్ యాడికి పసుపు పంట పోటెత్తింది. ఇందూరు తల్లి పాదాలకి పసుపు పారాణి అద్దినట్టుగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ పసుపు పంటతో పచ్చగా మారింది. పెద్ద ఎత్తున పసుపు పంట మార్కెట్ కమిటీకి తరలిరావడంతో సదానంద్ గంజ్ పసుపు నిల్వలతో రైతులతో మార్కెట్ యార్డ్ కళకళలాడుతోంది. 

ఈ ఏడు పసుపు పంట అధికంగా దిగుబడి రావడంతో రైతులకు లాభాలు కలిసొస్తున్నాయి.  నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ఆర్మూర్ మోర్తాడ్ కమ్మర్పల్లి భీమ్గల్ వేల్పూర్ మెండోరా ఎయిర్ గట్ల మండ లాలలో పసుపు పంట సాగు అధికంగా ఉంది. పసుపు సీజన్ ప్రారంభమైన నుండి సోమవారం మంగళవారం రోజు 23,74 బస్తాల పసుపును రైతులు నిజామాబాద్ మార్కెట్ యార్డ్ కు తెచ్చారు.

పసుపు పంట మార్కెట్ యార్డ్ కి వచ్చినప్పటి నుండి పసుపు పంట ధర క్వింటాలుకు 11వేల రూపాయలకు తగ్గకుండా ధర పలుకుతుండడంతో రైతులు పెద్ద మొత్తంలో పసుపును మార్కెట్ యార్డుకు తరలిస్తూ వచ్చారు. జిల్లాకు పసుపు బోర్డు ప్రకటించడంతో రైతులు గత ఏడాది కంటే ఏడాది పంటను ఎక్కువగా సాగు చేశారు.

పసుపు పంటలో ఉన్న రకాన్ని బట్టి 11 వేల నుంచి 13 వేల రూపాయల వరకు మద్దతు ధర పలకడం రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడున్నటువంటి పంటకు అయ్యే ఖర్చు దిగుబడి వల్లే వచ్చే లాభం నీబట్టి వేస్తే రైతులు పండించిన పసుపు పంట దయచేసి నాకు అధికంగా ఉండడంతో రైతులు కాస్త నిస్సాహానికి గురైతం ఆవేదన వ్యక్తం చేశారు.

పసుపు మార్కెట్ కు తరలివచ్చే ముందు రోజు 1500 వేలకు పలికిన క్వింటాలు పసుపుధర గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిందని రైతులు తెలిపారు. ఇది ఇలా ఉండగా ప్రథమంగా రైతులు పురుగు పట్టిన పంట గాని అనారోగ్యంగా ఉన్న పంట గాని ముందుగా మార్కెట్ కు తరలిస్తారని ఆ తర్వాత పూర్తిగా చేతికి వచ్చిన పంటను మార్కెట్కు తెస్తారని మేలు రకం పసుపు మార్కెట్ కు రావడం మొదలైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

మేలి రకం పసుపు గిట్టుబాటు దొర రూ. 15000 కల్పించడంతోపాటు ప్రభుత్వం అన్ని సౌక ర్యాలు కల్పిస్తే రైతులు పసుపు పంట సాగు కు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని రైతు నాయకులు కాంగ్రెస్ కిసాన్ మోర్చా నాయకులు వేల్పూర్ సొసైటీ డైరెక్టర్ ఏలేటి రాజేందర్ తెలిపారు. 

అకాల వర్షాల వల్ల కూడా పసుపు రైతులకు నష్టం వాటిల్లిందని రెండు ఎకరాల దిగుబడి కేవలం ఒకటిన్నర ఎకరం చొప్పున వచ్చిం దని మిగతా అర్ధ ఎకరం పంట రైతులు నష్టపోయారని అకాల వర్షం ఎందుకు కారణమని ఏలేటి రాజేంద్ర తెలి పారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కో కుండా ఉండేందుకు రైతులకు ప్రణాళిక బద్ధంగా మేలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పంటసాగు కష్టంగా మారింది

ప్రస్తుతం పసుపు పంట సాగు చాలా కష్టతరంగా మారింది అసలే ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో సాగు భూమిని మలపడం ఫినిషింగ్ చేయడం పసుపు ఉడకబెట్టడం అందుకు వంట చెరకు పంట కు పట్టిన కీటకాలను నివారించడానికి మందులు అన్నింటికీ కలిపి ఎకరాకి 1 లక్ష నుండి లక్షల 50 వేల వరకు ఖర్చు అవుతుంది. ఎకరానికి 20 నుండి 25 క్వింటాళ్లు పసుపు దిగుబడి వస్తుంది. 13000 వేల రూపాయలు క్వింటాలు ధర పలికితే రైతుకు మిగిలేది తక్కువే.

 ఏలేటి రాజేందర్, 

పసుపు రైతు, వేల్పూర్

ప్రభుత్వం ఆదుకోవాలి

నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు దఫ్తర్ తెచ్చినందుకు అరవింద్ సార్‌కు నమస్తే.  పసుపు పంటకు ఖర్చు బాగా అయితుంది తోంది ఎరువు లారీకి 35000 అయితుంది ఎకరంకు ఒక్క లారీ అయితుంది ఎరువు గిట్టుబాటు ధర మద్దతు ధర కలిపి 1500 వరకు క్వింటాలకు ఇస్తే రైతులను ఆదుకున్నట్టు ఉంటుంది.

 లోక భోజన్న, 

పసుపు రైతు, నూత్‌పల్లి

డొంకేశ్వర్ మండలం 

ఆరుగాలం సాగు చేస్తున్నాం

ఆరుగాలం పసుపు పంటను సాగు చేస్తున్నాం. మా కుటుంబమంతా పసుపు పంట సాగుతూ 9 నెలలు కష్టపడి సాగు చేస్తాను. మా ఇంటి మహిళలు దినమంతా పంట పొలాల్లో పనిచేస్తూనే ఉంటారు. పసుపు పంట అకాల వర్షం వలన కొంత దెబ్బతింది. 2014లో అరవింద్ పసుపు బోర్డు కాలేరు పొందాల్సింది పనులు జరుగుతున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించి పసుపు ధర 15 వేల క్వింటాల్ చొప్పున ఇస్తే రైతులను ఆదుకున్న వారు అవుతారు పసుపు కూడా ఇచ్చినందుకు దేశ ప్రధానికి కృషి చేసిన ఎంపి అరవిందుకు తెలంగాణ రైతుల తరఫున ధన్యవాదాలు.

 శ్రీనివాస్‌రెడ్డి, 

పసుపు రైతు వేల్పూర్

లాభాలు పండించే ధర లభిస్తోంది

ఈ సంవత్సరం పసుపు పంట అధికంగా పండించారు రైతులకు లాభాలు పండించే ధర లభిస్తోంది. క్వింటాలుకు10 వేలకు తగ్గకుండా ఇస్తున్నాం. గత మూడు రోజులుగా పసుపు భారీగా మార్కెట్ యార్డ్ కు వస్తోంది పదో తేదీన 27, వేల బస్తాల పసుపు మార్కెట్ యార్డ్ కు వచ్చాయి. 5 వేల బస్తాలు వదులుకొని ప్రతి దినం పెరుగుతూ వస్తోంది.

ఇటీవల మేం సాంగ్లీ పసుపు మార్కెట్ ని సందర్శించినప్పుడు మన రైతులు తీసుకెళ్లిన పసుపు క్వింటాల్  11,130 రూపాయల జర పలికింది. అక్కడికంటే ఇక్కడే మన మార్కెట్లో 13,137 రూపాయల క్వింటాల్ ధర పలుకుతుంది. ప్రస్తుత ధర క్వింటాలు12.000 తగ్గకుండా చూస్తున్నాం. గోలా పసుపు క్వింటాలు 9 వేలు తగ్గకుండా ఇస్తున్నాం. ‘కాడి‘ పసుపుకి క్వింటాల్ ధర 10 వేలు తగ్గకుండా ఇస్తున్నాం.

రైతులకు ముందే సూచిస్తున్నాం పూర్తిగా డ్రై ఎండిన పసుపు పంటను మాత్రమే ఒకటి తేవాలని చెప్తున్నాను. రానున్న రోజుల్లో ఇంకా అధిక మొత్తంలో రైతులు పసుపు పంటను మార్కెట్ యార్డ్ కు తెనున్నారు. పటిష్టమైన చర్యల మధ్య లాట్ అలాట్ చేస్తూ బీటును కొనసాగిస్తున్నాం. అంతా ఆన్లైన్లోనే నడుస్తోంది దళారీలకు ఎటువంటి అవకాశం లేదు. 

 ముప్ప గంగారెడ్డి, 

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, నిజామాబాద్