ఆ దేశ రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణతో ద్వుపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఆసక్తితో ఉన్నామని తుర్కియె దేశపు రాయబారి ఫిరట్ సునెల్ వెల్లడించారు. సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో శుక్రవారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరస్పర సహకారంపై మంత్రి, తుర్కియె రాయబారి చర్చించారు.
తుర్కియె, తెలంగాణ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు ఎంతో కాలంగా కొనసాగుతున్నట్టు మంత్రి వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయం, ఫార్మా, లైఫ్ సెన్సైస్, వాణిజ్య రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని మంత్రి వెల్లడించారు. భేటీలో తుర్కియె కాన్సుల్ జనరల్ ఓర్హాన్ యమన్ ఓకన్ కూడా పాల్గొన్నారు.