calender_icon.png 3 April, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుర్కయంజాల్ రైతు సేవా సంఘం 52వ సర్వసభ్య సమావేశం

29-03-2025 12:59:22 AM

- రైతుల అభివృద్ధి కోసమే రైతు సహకార సంఘాలు 

- ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, మార్చి 28 (విజయ క్రాంతి): రైతుల అభివృద్ధి కోసమే రైతు సహకార సంఘాలు పనిచేస్తాయని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని తుర్కయంజాల్ మున్సిపల్ కేంద్రంలో గల తుర్కయంజాల రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్ లో శుక్రవారం సంఘం చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య ఆధ్వర్యంలో 52వ సర్వసభ్య సమావేశం  నిర్వహించడం జరిగింది.

సంఘం సెక్రెటరీ వై రాందాస్ సంఘం ఏజెండ, చర్చనీయ అంశాలు, సంఘం రుణాలు, ఖర్చులు రాబడి వంటి విషయాలను వివరించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రైతు అభివృద్ధి లక్ష్యంగా రైతు సేవ సంఘాలు పనిచేస్తున్నాయని, రైతులకు రుణమాఫీ సబ్సిడీ రైతుల పనిముట్లు వ్యవసాయ యంత్రాలకు అతి తక్కువ ఈఎంఐతో అందించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ కొత్త రామ్ రెడ్డి, డైరెక్టర్లు చెక్క లక్ష్మమ్మ, వంగేటి లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, కూతాడి నర్సింగరావు, కొండ్రు స్వప్న, చాపల యాదగిరి, శీలం లక్ష్మమ్మ, జట్కా కృష్ణారెడ్డి, సామ సత్యనారాయణ రెడ్డి, జిట్టా భార్గవి రైతులు తదితరులు పాల్గొన్నారు.