calender_icon.png 3 October, 2024 | 8:53 PM

కూలటానికి సిద్ధంగా తుంగనాథ్ ఆలయం

03-10-2024 12:29:47 AM

ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఉన్న గుడి

డెహ్రాడూన్, అక్టోబర్ 2: ప్రపంచంలోనే సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న అతి ప్రాచీన శివాలయం కూలటానికి సిద్ధం గా ఉన్నది. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత సానువుల్లో సముద్ర మట్టానికి 3,680 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నదని స్థానికులు తెలిపారు. ఆలయం లోపలికి నీరు లీకవుతున్నదని, గుడి పునాదులు కూడా బలహీనపడ్డాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు నమ్ము తారు. ఆలయాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని బద్రీనాథ్, కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ రాజేంద్ర అజయ్ తెలిపారు. ఇప్పటికే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండి యా (జీఎస్‌ఐ)తోపాటు పురావస్తు శాఖను కూడా ఆలయ రక్షణ కోసం అభ్యర్థించామ ని, నిపుణులు గుడిని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.