calender_icon.png 28 December, 2024 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గత ప్రభుత్వం తుంగతుర్తిని పూర్తిగా విస్మరించినది

11-10-2024 04:46:09 PM

నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయం.. భువనగిరి ఎంపీ

తిరుమలగిరి (విజయక్రాంతి): గత బిఆర్ఎస్ ప్రభుత్వం తుంగతుర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తిర్మలగిరి మండలం పరిధిలోని తొండ గ్రామంలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలు భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లడుతూ..  తుంగతుర్తి నియోజకవర్గాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. బి.అర్.ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఒక్క అభివృద్ధి పనికూడా చేయలేదు కానీ ఇపుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పయనం వైపు తీసుకెళుతుంటే వారు జీర్ణించుకోలేక పోతున్నారు అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలు కూడ తుంగతుర్తి నియోజకవర్గాన్ని పారిశ్రామిక అభివృద్ధి వైపు తీసుకెళటానికి చాల కృషి చేస్తున్నారు. మందుల సామెలు మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించటానికి నా శాయశక్తులా కృషి చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజన్న, టూరీజం కర్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సంకేపల్లి సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.