calender_icon.png 25 November, 2024 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలిక కడుపులో 3.75 కిలోల కణితి

17-05-2024 02:05:59 AM

శస్త్రచికిత్సతో తొలగించిన కిమ్స్ కడల్స్ వైద్యులు

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఆఫ్రికాలోని సోమాలియా దేశానికి చెందిన పద్నాలుగేళ్ల బాలిక కడుపులో నుంచి మూడున్నర కణితిని హైదరాబాద్‌కు చెందిన కిమ్స్ కడల్స్ వైదులు వెలికితీశారు. కొద్ది రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ ఆఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో చేరింది బా లిక. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు కడుపు లో పెద్ద కణితి ఉందని గుర్తించారు. కానీ ఆ కణితి రక్తనాళాలకు అతుక్కొని ఉండటంతో ఆఫ్రికాలో ఈ చికిత్స చేయలేమని చెప్పారు. భారతదేశానికి వెళ్లాలని సూచించడంతో హైదరాబాద్ వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఇక్కడ వివిధ ఆస్పత్రులని సంప్రదించిన తర్వాత సికింద్రాబాద్‌లోని కిమ్స్ కడల్స్ ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడ బాలికకు పలు పరీక్షలు నిర్వహించి కుడివైపు మూత్రపిండానికి కణితి అతుక్కొని ఉండటంతో బయా ప్సీకి పంపారు. అది క్యాన్సర్ కాదని, సాధారణ కణితి అని నిర్ధారించారు. ఆపరేషన్‌లో భాగంగా కణితితో పాటు కుడివైపు మూత్రపిండాన్ని సైతం తొలగించారు. ఈ కణితి ఏకంగా 3.75 కిలోల బరువు ఉంది. ఆపరేషన్ చేసిన వైద్యులు యోగా నాగేందర్, అవినాశ్, ఆస్పత్రి సిబ్బందికి బాలిక కుటుంబసభ్యులు కృతజ్ఙతలు తెలిపారు.