calender_icon.png 4 March, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగరిక వికాస్ కేంద్రం ప్రారంభించిన తుమ్మల

03-03-2025 01:28:33 AM

ఖమ్మం, మార్చి 2 (విజయక్రాంతి): జమాఅతె ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో హ్యూమన్  వెల్ఫేర్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన నాగరిక వికాస్ కేంద్రం ను ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ , మార్కెటింగ్ , చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు.  ముఖ్య అతిథిగా పాల్గొన్న జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు సాధిక్ అహ్మద్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు  తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జమాఅతె ఇస్లామీ హింద్ ప్రారంభించిన నాగరికత వికాస కేంద్రం చాలా గొప్ప కార్య క్రమం , దీనివల్ల చాలామంది పేద ప్రజలకు , విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అంతేగాక జమాఅతె ఇస్లామీ హింద్ చేపట్టే అనేగా సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ సహాయ , సహకారాలు ఉంటాయని తెలి పా రు.

ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర  మాజీ  కార్యదర్శి ముహమ్మద్ ఇల్యాస్, జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ సమి, ఖిల్లా, ఇంద్రనగర్, ఇస్లాంపేట అధ్యక్షులు అబ్దుల్ మలిక్, నిజాముద్దీన్, అబ్దుస్ సుబూర్,   సభ్యులు  ఖలీల్ అహ్మద్ ఖాన్,అబ్దుల్ ముజీబ్.అబ్దుల్ రాపె, షేక్ ఇలియాస్, అబ్దుల్ రజాక్, గౌస్, ఫయాజ్, షేక్ మలిక్ ,రఫీ, నాసర్, గఫ్ఫార్, యమ్. పి.జె జిల్లా అధ్యక్షులు షక్ ఖాసిం  కార్యకర్తలు పాల్గొన్నారు.