హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 25 (విజయక్రాంతి): దక్షిణేశ్వర్ కేదారనాథ్ టెంపుల్ ట్రస్ట్, దేవభూమి ఉత్తరాఖండ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న భాగ్యనగర్ గోశాలలో బుధవారం ఘనంగా తులసీ పూ జ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్వామి అభిషేక్ బ్రహ్మచారి, యువ చేతన జాతీయ కన్వీనర్ రోహిత్ కుమార్ సింగ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్వామి అభిషేక్ బ్రహ్మచారి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, నాగరికత అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ప్రతి ఇంట్లో తులసి మాత పూజ చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం గౌహత్యను నిరోధించే చట్టాలు తీసుకురావాలని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ వా రు మన దేశ చరిత్రను మార్చడానికి ప్రయత్నించినా, విఫలమయ్యారని ఆయన పేర్కొ న్నారు.
యువ చేతన జాతీయ కన్వీనర్ రోహి త్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. లార్డ్ మెకా లే మన విద్యా విధానాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించినప్పటికీ, అది విఫలమైందని పేర్కొన్నారు.నూతన విద్యా విధానాన్ని ఆయ న అభినందించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జయపాల్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. గౌ మాత, భారత మాత అభివృద్ధి కోసం పని చేస్తున్నామని అన్నారు.