నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా హిందువు
ప్రకటించిన ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్
కార్యవర్గంలో కొత్తవారికే అవకాశమిస్తోన్న ట్రంప్
వాషింగ్టన్, నవంబర్ 14: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన కార్యవర్గ బృందాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే ముందే తన టీమ్‌ను ఖరారు చేసుకుంటున్నారు. డెమోక్రాట్ నుంచి రిపబ్లికన్‌గా మారిన భారత సంత తికి చెందిన తులసీ గబ్బార్డ్‌ను జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌గా ట్రంప్ నియమించారు. ఫలి తంగా తులసి నేతృత్వంలో అమెరికాలోని 18 గూఢచార సంస్థలు పనిచేయనున్నాయి.
2022లో రిపబ్లికన్ పారీలో చేరిన తులసి ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్‌కు గట్టి మద్దతుదారుగా మారి ప్రచారం నిర్వహించారు. అంతేకా కుండా ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు ఇవ్వడాన్ని తులసి వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
కాంగ్రెస్‌లో మొదటి హిందువు
హవాయి నుంచి ప్రతినిధుల సభకు 21 ఏళ్ల వయసులో తులసి ఎన్నికయ్యారు. ఆమె సభ లో మొదటి హిందూ సభ్యురాలుగా రికార్డు సృష్టించారు. బాధ్యతలు స్వీకరణ సమయంలో భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. తులసి 1981 ఏప్రిల్ 12న అమె సమోవాలోని లెలోలోవాలో జన్మించారు. అనంతరం వాళ్ల కుటుంబం హవాయిలో స్థిరపడింది. తులసి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పట్టా పొందా రు. ఆమె తండ్రి మైక్ గబ్బార్డ్ రిపబ్లికన్‌గా ఉన్నప్పటికీ తర్వాత డెమోక్రాట్స్‌కి మారారు.
హవాయి రాష్ట్రానికి సెనేటర్‌గా పనిచేశారు. సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్‌ను తులసి వివాహం చేసుకున్నారు. 2020లో అధ్యక్ష రేసులో డెమోక్రాట్లలో తులసి పేరు మార్మోగింది. విదేశీ సైనిక సంఘర్షణల్లో అమెరికా ప్రమేయాన్ని వ్యతిరేకించిన నేపథ్యంలో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. రెండేళ్లకు డెమోక్రటిక్ పార్టీని వీడి రిపబ్లికన్లలో చేరారు.
ట్రంప్ క్యాబినెట్‌లో యువరక్తం
అమెరికాకు అతిపెద్ద వయసులో అధ్యక్షుడిగా ఎన్నికై రికార్డు సృష్టించిన ట్రంప్.. తన క్యాబినెట్‌లో మాత్రం కొత్త రక్తాన్ని కూర్పు చేసుకుంటున్నారు. రక్షణ, నిఘా, విదేశీ వ్యవహారాలు, ఇమ్మిగ్రేషన్, చట్టాలను పర్యవేక్షించే పదవులకు ఎంతో అనుభవజ్ఞులను నియమిస్తారు. కానీ, ట్రంప్ 2.0లో మాత్రం ఎక్కు వగా 40 నుంచి 45 ఏళ్ల వర్ధమాన నాయకులకు బాధ్యతలను అప్పగిస్తున్నారు.
డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డాగ్) బాధ్యతలను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (53), వివేక్ రామస్వామి (39)కి అప్పగించడమే ఇందుకు ఉదాహరణ. తులసీ గబ్బార్డ్ వయసు 43 ఏళ్లు కాగా.. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వయసు 40. ట్రంప్ తన మొదటి పర్యాయంలో సంప్రదాయంగానే ఎంపిక చేసుకున్న ప్పటికీ ప్రస్తుత కార్యవర్గంలో ఎన్నో మార్పులు చేసినట్లు కనిపిస్తోంది.
ట్రంప్‌కు విధేయులుగా ఉన్నవారికీ ప్రాధాన్యం ఇస్తున్నపటికీ ప్రభుత్వ అనుభవం కంటే ప్రైవేట్ రంగంలో అంతర్‌దృష్టి, సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని ఎంచుకోవడం గమనార్హం. రక్షణ మంత్రిగా పీట్ హెగ్‌సెత్, పర్యావరణ సంరక్షణ ఏజెన్సీ పరిపాలకుడిగా లీ జెల్డిన్, ఐరాస అంబాసిడర్‌గా ఎలైస్ స్టెఫానిక్, అటార్నీ జనరల్, న్యాయ శాఖ అధిపతిగా మ్యాట్ గెట్జ్ వయసు కూడా 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉన్నాయి.