మహేశ్వరం, (విజయక్రాంతి): దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీలో తుల్జా భవాని మాత దేవాలయంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మ వారును , అదేవిధంగా యంగ్ ఇండియన్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మ వారిని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ. పట్లోళ్ల కార్తీక్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి గారు మాట్లాడుతూ... దసరా శరన్నవరాత్రుల సమయంలో తుల్జా భవానీ అమ్మవారి దివ్య దర్శనం జరగడం నిజంగా ఎంతో అదృష్టం అని, ప్రజలు అమ్మవారి దయవలన సుఖశాంతులతో సిరి సంపదలతో తల తూగాలని ప్రార్థించారని తెలిపారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా యువ నాయకులు కార్తీక్ రెడ్డి గారి వెంట అమ్మ వారిని దర్శించుకున్న వారిలో జల్ పల్లి మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. యంజాల జనార్ధన్ గారు, యూత్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ. యంజాల అర్జున్ గారు, గౌరవ 19వ వార్డ్ కౌన్సిలర్ శ్రీ పల్లపు శంకర్ గారు, మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి కర్నాటి పద్మ గారు, 17వ వార్డు అధ్యక్షులు శ్రీ.నాగేష్ ముదిరాజ్ గారు, 18 అధ్యక్షులు శ్రీ. గుండు నర్సింగ్ గారు, 19 వ వార్డ్ అధ్యక్షులు శ్రీ. మారుతి గారు, వెంకటేశు తదితరులు మరియు రాజేంద్రనగర్ నియోజకవర్గం సీనియర్ నాయకులు శ్రీ. నోముల రాము యాదవ్ గారు, శ్రీ. అక్కేం రఘు యాదవ్ గారు, శ్రీ గుమ్మడి కుమార్ గారు, శ్రీ అరుణ్ ముదిరాజ్, శ్రీ సురేష్ ముదిరాజ్ గారు, శ్రీ. అక్కేం శ్రీనాద్ గారు, శ్రీ. రాజు గారు, శ్రీ. కొంపల్లి జగదీష్ గారు, మహిళలు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.