calender_icon.png 31 October, 2024 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒలింపిక్స్‌కు తులికా మాన్

26-06-2024 01:10:22 AM

  • జూడో విభాగంలో అర్హత

న్యూఢిల్లీ: భారత మహిళా జూడో ప్లేయర్ తులికా మాన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం అంతర్జాతీయ జూడో ఫెడరేషన్ (ఐజేఎఫ్) విశ్వ క్రీడలకు అర్హత సాధించిన జూడో ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. 1345 పాయింట్లతో 36వ ర్యాంక్‌లో నిలిచిన తులికా 78 ప్లస్ కేజీల విభాగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. జూన్ 22, 2023 నుంచి జూన్ 23, 2024 వరకు ఒలింపిక్ క్వాలిఫికేషన్ కటాఫ్ పీరియడ్‌గా నిర్ధారించి జాబితాను ప్రకటించినట్లు ఐజేఎఫ్ తెలిపింది.

ఒక దేశం నుంచి ఒకే కేటగిరీలో ఎక్కువ మంది జూడో ప్లేయర్లు ఉంటే అర్హత ఆధారంగా ఒక్కరికి మాత్రమే పారిస్ టికెట్ దక్కనున్నట్లు తెలిపింది. ఇందుకోసం జూలై 2న నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఎన్‌వోసీ) ఒక్కో కేటగిరి నుంచి అథ్లెట్లను నామినేట్ చేయనుందని ఐజేఎఫ్ వెల్లడించింది. గతంలో జూడో విభాగంలో భారత్ నుంచి సుశీలా దేవి లింబాకమ్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంది. 48 కేజీల విభాగంలో పోటీ పడిన సుశీల తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.