calender_icon.png 24 January, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బిల్లుపై టగ్ ఆఫ్ వార్.. బాటిల్ పగులగొట్టిన టీఎంసీ ఎంపీ

23-10-2024 01:38:29 AM

టీఎంసీ ఎంపీ..చేతికి గాయం  

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: వివాదాస్పద వక్ఫ్ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. తాజాగా చర్చ సంద ర్భంగా మంగళవారం వాగ్వాదం శృతి మిం చింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. టేబు ల్‌పై తన ఎదురుగా ఉన్న గాజు గ్లాసును టేబుల్‌కేసి బలంగా కొట్టడంతో అది భళ్లున ము క్కలైంది. దీంతో ఆయన కుడిచేతి బొటన వేలికి గాయమైంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన జేపీసీ చైర్‌పర్సన్ జగదాంబికా పాల్.. వచ్చే సమావేశం నుంచి కల్యాణ్‌ను సస్పెండ్ చేశారు.  బిల్లుపై వివిధ వర్గాల ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకొంటున్న జేపీసీ.. మంగళవారం మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదుల అభిప్రాయాలను రికార్డు చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు నిరసనకు దిగారు.