calender_icon.png 25 October, 2024 | 10:57 AM

‘తుఫాన్’ 9న

04-08-2024 12:43:08 AM

హీరో విజయ్ ఆంటోనీ తాజా చిత్రం ‘తుఫాన్’ వాయిదా పడింది. ఆగస్టు 2న రావాల్సిన ఈ సినిమా విడుదలను మేకర్స్ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఈ చిత్రం ఇదే నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు వారు ప్రకటించారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకుడు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్ బోరా నిర్మాతలు. శరత్‌కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాశ్, మురళీశర్మ తదితరులు ముఖ్య తారాగణంగా ఉన్నారు.