calender_icon.png 6 February, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైట్ టీబీ ఇంజక్షన్‌తో క్షయ నిర్ధారణ మరింత వేగం

06-02-2025 12:00:00 AM

కోటాచలం, డీయంఅండ్‌హెచ్‌వో 

హుజూర్ నగర్, ఫిబ్రవరి 5: సైట్ టీబి ఇంజక్షన్ తో క్షయ వ్యాధి నిర్ధారణలో మరింత వేగం పుంజుకోనున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం అన్నారు.బుధవారం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో నిశ్చయ్ సివిర్ క్యాంపు నందు జిల్లాలో తొలిసారి సైట్ టిబి ఇంజక్షన్ ను ప్రారంభించినారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధికి కారణ మయ్యే బ్యాక్టీరియా వ్యక్తులను గుర్తించడంలో మరింత ఉపయోగకారి గా సైట్ టీబీ ఇంజక్షను ఉంటుంద న్నారు.మన జిల్లాలో టీబీ నిర్ధారణకు కళ్లపరీక్ష,ఎక్స్ రే ద్వారానే కాక సైట్ టిబి ఇంజక్షన్ ద్వారా రోగి యొక్క సంబంధిత వ్యక్తులకు వ్యాధి సోకిందా లేదా అనే విషయాన్ని త్వరగా తెలుసు కోవచ్చని తెలియజేశారు.

జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ నాజియా తబుస్సం, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ జయ మనోరి, డాక్టర్ పాపిరెడ్డి, వైద్యాధి కారులు వేణుగోపాల్ నాయక్, పుష్పలత,సి హెచ్ ఒ లు పద్మ, మనోహర రాణి,ప్రసాద్, మాధవ్,వైద్య సిబ్బంది ఇందిరాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.