calender_icon.png 26 March, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషక ఆహారంతో క్షయ వ్యాధి దరిచేరదు

24-03-2025 05:58:47 PM

ఆర్. ఎం.ఓ సుధాకర్ రావు...

హుజురాబాద్ (విజయక్రాంతి): పోషక ఆహారంతో క్షయ వ్యాధి దరిచేరదని హుజురాబాద్ ఆర్ఏంవొ సుధాకర్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో సోమవారం వరల్డ్ టీవీ డే ని పురస్కరించుకొని డివై డిఎంహెచ్వో, ఏరియా హాస్పిటల్ హుజురాబాద్, చిల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ప్రధాన వీధులలో టీబి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఆర్ఎంవో సుధాకర్ రావు మాట్లాడుతూ.. క్షయ వ్యాధి గురించి రోగులు భయపడాల్సిన అవసరం లేదని, డాక్టర్ల సూచన మేరకు క్రమం తప్పకుండా కోర్సు వాడితే నయం అవుతుందని రోగులకు సూచించారు. క్షయ రోగుల కోసం ప్రతి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచిత పరీక్ష, మందులు, పోషక ఆహార నిమిత్తం నెలకు రూ.1000 అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుకర్, మెడికల్ ఆఫీసర్ జరీనా, ఎంఎల్ హెచ్పి బంజారా ప్రతాప్, విజేందర్ రెడ్డి, సమ్మయ్య, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, దేవదర్, సుజాతతో పాటు తదితరులు పాల్గొన్నారు.