calender_icon.png 24 October, 2024 | 2:50 PM

బెంగాల్ లో డాక్టర్ హత్యను నిరసిస్తూ టీటీడీజీఏ, టీజీడీజీఏ కొవ్వొత్తుల ర్యాలీ

12-08-2024 09:20:49 PM

కరీంనగర్: వైద్యులు, సిబ్బందికి రక్షణ కల్పించాలని, బెంగాల్ లో డాక్టర్ హత్యను నిరసిస్తూ టీటీడీజీఏ, టీజీడీజీఏ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీ మెడికల్ కాలేజీలోని పల్మనరీ విభాగంలో రాత్రి విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ను సెమినార్ రూంలోనే రేప్ చేసి హత్య చేశారు. దీంతో తెలంగాణ టీచింగ్ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీడీజీఏ), తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్(టీజీడీజీఏ) తీవ్రంగా ఖండించింది.

టీటీడీజీఏ అసోసియేషన్ కరీంనగర్ శాఖ అధ్యక్షులు డా. హరి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఐఎంఏ అసోసియేషన్ నాయకులు, ప్రతిమ, చల్మెడ మెడికల్ కాలేజీలతోపాటు కరీంనగర్ కు చెందిన డాక్టర్లు సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా నుండి కోర్టు చౌరస్తా వరకు నిర్వహించిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.

రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న డాక్టర్లకు రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా డాక్టర్ హరిక్రిష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.  నిరంతరం కాపాడుతు డాక్టర్లకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. తెలంగాణ, పశ్చిమబెంగాల్ సహా దేశవ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్లకు, నర్సులకు, ఇతర మెడికల్ సిబ్బందికి హాస్పిటల్స్ లో తగిన పోలీస్ సెక్యూరిటీ కల్పించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.